సర్కార్ తెలుగులో సేఫ్ అయ్యేలాగే ఉంది !

Published on Nov 8, 2018 2:17 pm IST

భారీ అంచనాల మధ్య మొన్న విడుదలైన ‘సర్కార్’ చిత్రం బాక్సాఫిస్ రికార్డులను తిరగరాస్తుంది. తమిళ్లో విజయ్ కు వున్నా క్రేజ్ మూలన అక్కడ ఈ చిత్రం మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టింది. ఇక ఈచిత్రం తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రేక్షకులకు విజయ్ పెద్దగా పరిచయం లేకపోవడం అలాగే తమిళ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా సాగడంతో మిక్సడ్ రివ్యూస్ వచ్చాయి. అయితే ఆ ప్రభావం మాత్రం కలక్షన్ల ఫై పడలేదు.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో రూ.2.32 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా 2కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి అదే జోరును కొనసాగించింది. దాంతో ఈ చిత్రం మరో మూడు కోట్ల షేర్ రాబడితే సేఫ్ జోన్ లోకి రానుంది. మరో వారం వరకు తెలుగులో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈచిత్రానికి అడ్వాంటేజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

X
More