‘ఎంత మంచివాడవురా’ టీజర్ ఎంత బాగుందో

Published on Oct 9, 2019 10:20 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చిత్ర టీజర్ విడుదలైంది. నిమిషం పైగానే నిడివి ఉన్న ఈ టీజర్ ఆహ్లాదకరంగా ఉంది. సతీష్ గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగనుంది.

పాత్రలన్నీ హీరో ఎంతో మంచివాడు, చాలా గొప్పవాడు అంటూ పరిచయం చేయగా హీరో మాత్రం పది మందిని చితకబాదుతూ కనిపిస్తాడు. మొత్తానికి టీజర్ ద్వారా సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగి ఉంటుందని అర్థమవుతోంది. కళ్యాణ్ రామ్ ఈ తరహా కథలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటిస్తోంది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More