వైవిధ్యమైన పాత్రలో ‘పూర్ణ’ !

Published on May 11, 2019 10:00 am IST


సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా “సువర్ణసుందరి”. పునర్జన్మల నేపధ్యంలో రానున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ‘మే’ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో జయప్రదతో పాటు పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలను పోషించారు.

కాగా ఈ సినిమాలో పూర్ణ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. పైగా జయప్రదకు తల్లిగా పూర్ణ నటిస్తోందట. ఇక సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ ఈ సినిమాను తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటొంది.

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత బాణీలు సమకూరుస్తుండగా నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ లాంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More