లవ్ స్టోరీ లో చైతూ, పల్లవి ల నేపథ్యం అదేనా?

Published on Feb 14, 2020 12:06 am IST

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల మొట్టమొదటి సారి నాగ చైతన్యతో చేస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఏయ్ పిల్లా..సాంగ్ ప్రివ్యూ రేపు ప్రేమికుల రోజు కానుకగా ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. కాగా లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవిల లుక్స్ చాల ఆసక్తికరంగా ఉన్నాయి.

వీరిద్దరూ సాదా సీదా దుస్తులలో పేద కుటుంబాలకు చెందిన వారిగా ఉన్నారు. గతంలో నాగ చైతన్య పై ఓ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో రాగా అందులో నాగ చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్ లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్ లా కనిపించాడు. ఇక తాజాగా విడుదలైన సాయి పల్లవి లుక్ కూడా అలాగే ఆర్డినరీ పేదింటి అమ్మాయిలా ఉంది. దీనితో లవ్ స్టోరీ పేద వాళ్ళైన ఇద్దరు యువతీ యువకుల మధ్య నడిచే కథ అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More