టాక్..”సర్కారు వారి పాట” కి కూడా లాస్ట్ లోనే అసలైన ట్రీట్.?

Published on Apr 12, 2022 7:32 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంకా కేవలం ఒక్క నెల వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ సినిమా హంగామా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయింది.

మేకర్స్ కూడా అలర్ట్స్ చేస్తుండడంతో మరింత హైప్ స్టార్ట్ కాగా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాపై తెలుస్తుంది. దీని ప్రకారం మహేష్ చేసిన లాస్ట్ సినిమా “సరిలేరు నీకెవ్వరు” సినిమాలానే ఈ సినిమా సెకండాఫ్ లో కూడా ఒక పక్కా మాస్ సాంగ్ లాంటి ట్రీట్ ఉందని తెలుస్తుంది. దీనితో మళ్ళీ థియేటర్స్ లో సాలిడ్ ట్రీట్ కన్ఫర్మ్ అట. ఇప్పటికే థమన్ ఇచ్చిన రెండు సాంగ్స్ మంచి హిట్ కాగా మిగతా సాంగ్స్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ టైం టు టైం విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :