మళ్లీ ఇన్నాళ్ళకు కామెడీ ఎంటర్ టైనర్ లో.. !

Published on Mar 17, 2019 11:55 pm IST

మాస్ హీరో గోపీచంద్ మొత్తానికి కామెడీ సినిమా చెయ్యబోతున్నాడు. దర్శకుడు సంపత్ నంది, గోపీచంద్ కోసం ఓ మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంపత్ నంది ఈ స్క్రిప్ట్ ని పూర్తి చేశాడు. గోపిచంద్ కి కూడా సంపత్ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ బాగా నచ్చిందట. అందుకే తన సినిమాగా ఈ సినిమానే పట్టాలెక్కించాలని గోపీచంద్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇక గోపీచంద్ చేసిన లాస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లౌక్యం’. ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే మంచి హిట్ చిత్రంలా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్ళకు గోపీచంద్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More