ఒకే ఫ్రేమ్ లో ఇండియన్ బాక్సాఫీస్ రూలర్స్ “సలార్”, “రాకీ భాయ్”.!

Published on Jan 15, 2021 1:00 pm IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి పాన్ ఇండియన్ లెవెల్లో తమ దమ్ము చూపిస్తున్న టాప్ మోస్ట్ హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాగా మరొకరు “కేజీయఫ్ చాప్టర్ 2″తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త ఫిగర్స్ నమోదు చెయ్యడానికి రెడీగా ఉన్న కన్నడ హీరో యష్ లు అనే చెప్పాలి. ప్రభాస్ ఎలాగో ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరి ఇదిలా ఉండగా యష్ తో కేజీయఫ్ అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో మరో సెన్సేషనల్ ఆక్షన్ ఎంటర్టైనర్ “సలార్”ను అనౌన్స్ చేశారు. మరి అక్కడ నుంచి ఈ చిత్రానికి విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం ముహుర్తాన్ని మేకర్స్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్లాన్ చేసారు.

మరి ఈ కార్యక్రమానికి గాను సలార్ ప్రభాస్ మరియు రాకీ భాయ్ యష్ లు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఒకరేమో ఆల్రెడీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపించాడు. మరి “కేజీయఫ్ చాప్టర్ 2″తో ఖచ్చితంగా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అనిపించేలా ఉన్న యష్ లు కలిసి కనిపించిన ఈ ఫోటో ఇప్పుడు వారి అభిమానులు మరియు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :