ఎన్టీఆర్ బయోపిక్ లో ఇందిరా గాంధీ పాత్ర ఎవరు చెయ్యబోతున్నారు ?

1st, February 2018 - 11:03:28 AM

బాలకృష్ణ చెయ్యబోయే తరువాతి సినిమా ఎన్టీఆర్ బయోపిక్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర కోసం నదియా లేదా విజయ శాంతిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం తేజ వెంకటేష్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ ను స్టార్ట్ చెయ్యనున్నారు. భారీగా నిర్మించనున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తుంటే కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్ సినిమా పోస్టర్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.