మొదటి రెండు సీజన్ లు వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగియగా మూడవ సీజన్ గా వస్తున్న బిగ్ బాస్ 3 మాత్రం రోజుకొక వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ షో విషయంలో నన్ను మోసం చేసారని, లైంగిక వేధింపులకు గురిచేశారని శ్వేతా రెడ్డి గళం ఎత్తగా, ఆమెకు తోడుగా నా విషయంలో కూడా ఇదే జరిగిందంటూ గాయత్రీ గుప్తా గొంతు కలిపారు. వీరిద్దరూ విడివిడిగా పోలీస్ స్టేషన్స్ లో పిర్యాదులు చేయడం జరిగింది.అలాగే కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, ఆతరువాత ఓయూ విద్యార్థులు వీరికి మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఓయూ విద్యార్థులైతే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిని చుట్టముట్టడం వంటి చర్యలకు పాల్పడి హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ని వివాదాల మధ్య బిగ్ బాస్ 3 మొదలవుతుందా లేదా అనుకున్న తరుణంలో కొద్ది సేపటి క్రితం స్టార్ మా తన అధికార ట్విట్టర్లో బిగ్ బాస్ 3 ప్రోమోని పోస్ట్ చేసి,ఈ షో ప్రసారం లాంఛనమే అన్నట్లుగా హింట్ ఇవ్వడం జరిగింది. 15మంది సెలెబ్రిటీస్ తో 100 రోజులు సాగే గ్రాండ్ షో నేడే ప్రారంభం కానుందని ఆ ప్రోమోలో చెప్పడం జరిగింది. ఇన్ని వివాదాల మధ్య మొదలుకానున్న బిగ్ బాస్3 కి ఇంకా కొంచెం క్రేజ్ యాడ్ అయ్యింది. మరి ఈ షో ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి స్పందన ఏమిటో చూడాలి.
The wait is over for the Biggest Reality Show!!! #BiggBossTelugu3 with @iamnagarjuna Starting Today at 9 PM on @StarMaa pic.twitter.com/8lOZphDHgq
— STAR MAA (@StarMaa) July 21, 2019


