ఇంటిలిజెంట్ కంప్లీట్ యాక్షన్ సినిమా అనుకుంటే పొరపాటే !

సాయి ధరమ్ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాణంలో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంటిలిజెంట్. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో చమకు చమకు పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసారు. థియేటర్స్ లో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుందని నిర్మాత తెలిపాడు.

తాజా సమాచారం మేరకు ఈ మూవీలో కామెడికి మంచి ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం. టిజర్, ట్రైలర్ లో హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ చూసి చూసి ఇది యాక్షన్ సినిమా అనుకుంటే పొరపాటే. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదేరోజు మోహన్ బాబు గాయత్రి సినిమా విడుదలవ్వడం విశేషం.