ఇంట్రెస్టింగ్..40 ఏళ్ల కితం ఆగిన ఏఎన్నార్ సినిమా రిలీజ్ కి సిద్ధం.!

Published on Aug 17, 2022 10:00 am IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే తన కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ దిగ్గజ హీరో నటించినటువంటి అలనాటి ఓ చిత్రం ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత విడుదలకి సిద్ధం అయింది.

ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు అయితే 1982లో “ప్రతి బింబాలు” అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మరియు కె ఎస్ ప్రకాష్ రావు లు దర్శకత్వం వహించగా జయసుధ హీరోయిన్ గా నటించారు. అయితే అప్పట్లో ఈ చిత్రం కంప్లీట్ అయినా కూడా పలు కారణాల చేత రిలీజ్ కి నోచుకోలేదట.

దీనితో మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఇపుడు రిలీజ్ అనేది అక్కినేని అభిమానులకి అయితే మూవీ లవర్స్ కి ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :