ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్లో “రాధే శ్యామ్”..ఇవి క్లియర్ అయ్యినట్టేనా?

Published on Oct 28, 2020 9:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా “జిల్” ఫేమ్ లో రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ కు గాను అన్ని భాషల ఆడియెన్స్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏఈ చిత్రాన్ని దర్శకుడు వింటేజ్ లవ్ స్టోరీగా తీస్తున్న సంగతి తెలిసిందే.

కానీ ఇపుడు ఈ చిత్రం ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుందో అన్నది కాస్త క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సచిన్ ఖేడేకర్ దీనిని రివీల్ చేశారు. ఈ చిత్రం రెండు భిన్న కోణాలు అయినటువంటి జ్యోతిష్యం మరియు సైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలిపారు. దీనితో ఇదే ఇప్పుడు చర్చగా కొనసాగుతుంది. అయితే ఇందులనే రెండు బ్యాక్ డ్రాప్స్ ఉన్నప్పుడు ఆసక్తిరంగా రెండు స్టోరీ లైన్స్ కానీ ఉన్నాయా అనే కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మొదటి నుంచి డ్యూయల్ రోల్స్ అంటూ పలు గాసిప్స్ ఈ చిత్రం చుట్టూతా చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు సినిమా బ్యాక్ డ్రాప్ పై క్లారిటీ వచ్చింది. సో ఈ రెండు లైన్స్ ఏమన్నా మెయిన్ లీడ్ రోల్స్ కు సెపరేట్ గా లింకప్ అయ్యి ఉంటాయా అనే డౌట్స్ మొదలవుతున్నాయి. దీనితో ఈ అంశాలు కాస్త క్లియర్ కాకపోయినా అందుకు దగ్గరగా ఊహించుకోవచ్చు. మరి రాధా కృష్ణ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More