‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదలయ్యేది ఆ రోజేనా ?
Published on Dec 5, 2017 8:42 am IST

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినషన్లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. హైదరాబాద్లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాటిలో టీజర్ కూడా ఒకటి. సోషల్ మీడియాలో టీజర్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి.

మరి ఈ తేదీ పక్కానో కాదో తెలియాలంటే హారికా, హాసిని క్రియేషన్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ చిత్ర ఆడియో కూడా ఈ డిసెంబర్ నెలలోనే విడుదలకానుంది. 2018 జనవరి 10న విడుదలకానున్న ఈ సినిమాను ఓవర్సీస్లో రికార్డ్ స్థాయిలో 209 లొకేషన్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత భారీ లెవల్లో విడుదలకాలేదు.

 
Like us on Facebook