వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న బన్నీ ఏ కొత్త సినిమాకీ ఇప్పటి వరకు సైన్ చేయలేదు. దాంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో బన్నీని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది.
ఈ ప్రశ్నల నేపథ్యంలో బన్నీ తర్వాతి సినిమాను భిన్నంగా చేయాలనుకుంటున్నాడని, అందుకే ‘మనం, 24’ వంటి విభిన్నమైన చిత్రాలను తీసిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే కథాపరమైన చర్చలు ముగిశాయని, త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానుందని అంటున్నారు.
మరోవైపు కొరటాల శివతో కూడ బన్నీ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదనే గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీ ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.


