చరణ్ కొత్త సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Jul 13, 2020 11:35 am IST

‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం, ఈ న్యూస్ మరోసారి మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుండి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు మరియు ఉత్సుకత అభిమానులలో చాలా ఎక్కువైపోయాయి. తాజా గాసిప్ ఏమిటంటే చరణ్ మరియు వంశీ ఇద్దరూ ఇటీవల కలుసుకుని.. ఓ కథను సూత్రప్రాయంగా అంగీకరించారట. చరణ్ అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని.. వంశీ కూడా అలాంటి కథతోనే ముందుకు వెళ్లదామని ఇద్దరూ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అంటే ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోంది. ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించనున్నాడు. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. అయితే చరణ్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు వెబ్ సిరీస్ చేయాలని చూస్తున్నాడట వంశీ. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించాయి.

సంబంధిత సమాచారం :

More