రామ్ చరణ్ ‘రంగస్థలం’ గురించిన కొత్త హడావుడి !

రామ్ చరణ్ ‘రంగస్థలం’ గురించిన కొత్త హడావుడి !

Published on Jun 29, 2017 2:41 PM IST

ranghastalam1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ ముగించుకుని త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. ఇప్పుటికే 0 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ హడావుడి చేస్తుంది. అది కూడా కథ గురించే కావడం విశేషం.

మొదటి నుండి సినిమాలో చరణ్ ఒక పల్లెటూరి యువకుడిని, హీరోయిన్ సమంత కూడా పల్లెటూరి అమ్మాయేనని, వారిద్దరి మధ్య నడిచే ప్రేమ కథ, దాని కోసం వాళ్ళు చేసే పోరాటమే ఈ రంగస్థలమని అన్నారు. కానీ కొత్తగా ఇందులో చరణ్ ఒక థియేటర్ ఆర్టిస్టుగా కనిపిస్తాడని, రంగస్థలం అనేది అతని కంపెనీ పేరని అంటున్నారు. మరి ఈ వార్తలో ఏమాత్రం నిజముందో తెలీదు కానీ మెగా అభిమానులు ఏది వాస్తవమో తెలుసుకోవాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2018 ఆరంభంలో విడుదలకానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు