మహేష్ మూవీలో కీర్తి సురేష్ రోల్ ఇదేనా?

Published on Jul 6, 2020 6:57 am IST

ఓ ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే..క్రేజీ సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంటుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ డైరెక్ట్ గా ఓ టి టి లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కీర్తి పాత్రకు ప్రశంశలు దక్కాయి. కాగా మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి పాత్రపై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

కీర్తి సురేష్ ఈ మూవీలో బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపిస్తుందట. ఇంటెలిజెంట్ మహేష్ ప్రేమలో పడే సాఫ్ట్ బ్యాంకు ఉద్యోగినిగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More