నాగార్జున సినిమా టైటిల్ అదేనా ?
Published on Feb 27, 2018 8:44 am IST

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కలయికలో ఓక్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క టైటిల్ ను ఇది వరకే ప్రకటించాల్సి ఉండగా నటి శ్రీదేవి మరణంతో అది కాస్తా వాయిదా పడింది. ఇంకా కొత్త ప్రకటన తేదీని కూడ అనౌన్స్ చేయలేదు నిర్మాతలు.

కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్రానికి ‘ఆఫీసర్’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరి ఇదే సినిమా యొక్క అసలు టైటిలో కాదో తెలియాలంటే టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇందులో నాగార్జున స్టైలిష్, టఫ్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారట. ప్రస్తుతం ముంబైలో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నూతన నటి మైరా సరిన్ హీరోయిన్ గా నటిస్తోంది

 
Like us on Facebook