ప్రభాస్ “ఆదిపురుష్” పై ఆసక్తికర బజ్.!

Published on May 6, 2021 7:43 pm IST

పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాలన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస కావ్యం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అద్భుత చిత్రానికి సంబంధించి మరిన్ని బయటకు వస్తున్నాయి.

ఈ సినిమా విషయంలో ఎన్నో ఏళ్ల నుంచి ఓంరౌత్ రీసెర్చ్ చేసాడట. ఏడు వేల సంవత్సరాల కిందటి కథను ఎంత జాగ్రత్తగా తియ్యాలో అందుకు తగినంత రీసెర్చ్ ను చేసాడట. అలాగే మరో పక్క రామాయణంలోని ఇతర కీలక పాత్రలకు సంబంధించి కూడా క్యాస్టింగ్ ఎంపిక పనులు జరుగుతున్నట్టుగా మరో టాక్ ఉంది. మరి ఆ కీలక పాత్రల్లో ఏ నటులు కనిపిస్తారో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ అలాగే రావణ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :