మాస్ మహారాజ్ “ఖిలాడి” మ్యూజిక్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్.!

Published on May 6, 2021 12:00 pm IST

దర్శకుడు గోపీచంద్ మలినేనితో తీసిన లేటెస్ట్ మాస్ హిట్ “క్రాక్” తర్వాత మాస్ మహారాజ్ రవితేజ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా స్టార్ట్ చేసేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడి”. దర్శకు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా రవితేజ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దేవి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వదిలాడు. ఈ చిత్రంలో రవితేజ నెగిటివ్ షేడ్ లో కూడా కనిపిస్తాడని దానికి మరియు టోటల్ మ్యూజిక్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఈ చిత్రానికి ట్రై చేసానని తెలిపాడు.

అంతే కాకుండా ఇది వరకు తమ కాంబోలో వచ్చిన ఆల్బమ్స్ మించే ఖిలాడి ఉంటుందని ఆల్రెడీ సాంగ్స్ కూడా కంప్లీట్ అయ్యిపోయాయని దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. మరి ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :