బాలీవుడ్ బడా ఆఫర్ తిరస్కరించిన దేవరకొండ?

Published on Aug 2, 2019 9:35 pm IST

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” డియేటర్లలో సందడి చేస్తుంది. మరో రెండు మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విజయ్ ని ఎలాగైనా హిందీలో తన సొంత నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. “డియర్ కామ్రేడ్” హిందీ రీమేక్ హక్కులను కరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఏ హీరోతో చేయాలన్న విషయాన్నీకరణ్ ఇంకా నిర్ణయించలేదు. మరి కరణ్ హిందీ డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ ని నటింపజేయాలని చూస్తున్నారో? లేక ఏదైనా ఫ్రెష్ స్టోరీ తో లాంచ్ చేయాలని చూస్తున్నారో?తెలియదు కానీ, ప్రయత్నాలైతే చేస్తున్నారట.

ఐతే ఆసక్తికర విషయం ఏమిటంటే విజయ్ ఇందుకు సుముఖంగా లేరట. కరణ్ రెమ్యూనరేషన్ గా భారీ మొత్తం ఆశ చూపినా కూడా విజయ్ ఆయన ప్రతిపాదనను తిరస్కరించారట. తెలుగులో హీరోగా ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేయడం మంచిది కాదని విజయ్ భావిస్తున్నారట. మరి ఈ క్రేజీ న్యూస్ లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ పత్రిక ప్రచురించడం జరిగింది.

సంబంధిత సమాచారం :