“ఆదిత్య 369” సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 20, 2021 10:44 pm IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా ఒక బెంచ్ మార్క్ సినిమాగా నిలిచింది “ఆదిత్య 369” చిత్రం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ చిత్రం పై సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మొన్నటితో ఈ సినిమా వచ్చి 30 ఏళ్ళు కూడా అయ్యిపోయింది. అయితే మరి ఈ చిత్రానికి సీక్వెల్ తానే డైరెక్ట్ చేస్తానని అంతే కాకుండా అదే సినిమాతో తన కొడుకు నందమూరి మోక్షజ్ఞ్య హీరోగా పరిచయం కానున్నాడని తెలిపారు.

అయితే మరి దానిపైనే మరింత సమాచారం బాలయ్య తెలిపారు. ఈ చిత్రాన్ని “ఆదిత్య 999 మాక్స్” అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసానని ఎందుకంటే ఈ సినిమా అంతకు మించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ అనుకున్నానని తెలిపారు. అలాగే ఈ సినిమాలో తాను కూడా నటించొచ్చు ఒక సీక్వెల్ లో అని టాక్ కూడా వినిపిస్తుంది. మరి దీనిపై సరైన సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం బాలయ్య మరోసారి టైం ట్రావెల్ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :