“కేజీయఫ్ 2” క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 17, 2021 3:07 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా కోసమే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. అలాగే ఈ చిత్ర యూనిట్ నిన్ననే నిర్వహించిన క్లబ్ హౌస్ లో చర్చించుకున్న మాటల ద్వారా పలు ఆసక్తికర అంశాలే వినిపించాయి.

ఈ సినిమా సినెమాటోగ్రఫహీర్ భువన్ గౌడ ఈ సినిమా తర్వాత యాష్ క్రేజ్ మరో స్థాయికి వెళుతుంది అని తెలిపాడు. అలాగే క్లైమాక్స్ పై కూడా సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ అనుకున్న దానికంటే సూపర్ గా వచ్చింది అని అది కూడా విజువల్ గా భారీ లెవెల్ ట్రీట్ ని ఇస్తుంది అని తెలిపారు. అలాగే ఈ క్లైమాక్స్ కూడా ప్రతీ ఒక్కరినీ షాక్ కి గురి చేస్తుందని సమాచారం. మొత్తానికి నీల్ మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేసాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :