రాజమౌళి, మహేష్ భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం.!

Published on Jul 21, 2021 1:57 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు భారీ చిత్రాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఒక సాలిడ్ సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా మొత్తం టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” తర్వాత ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను ఇద్దరూ స్టార్ట్ చెయ్యనున్నారు.

అయితే ఈ గ్యాప్ లో మహేష్ రెండు సినిమాలను పూర్తి చేసేయనుండగా వారి కాంబోలో సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. రాజమౌళి అన్ని సినిమాలకు కూడా కథను అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ నే అందిస్తారని తెలిసిందే. అలా ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఒక స్ట్రాంగ్ సబ్జెక్టు పై వర్క్ చేస్తున్నాని ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

బాలీవుడ్ వర్గాలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో రాజమౌళి ఎలాంటి తరహా సినిమా ఆలోచిస్తున్నారో తెలిపారు. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లోనే ఒక సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ గా రాయమన్నారట అలాగే ప్రస్తుతం తాను అదే డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలుపుతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఈ సినిమాని ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని కూడా బజ్ వినిపించింది. సో మొత్తానికి మాత్రం వీరి నుంచి ఏ తరహా సినిమా రానుందో ఓ క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :