‘సర్కారు వారి’ మాస్ బ్లాస్ట్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Aug 4, 2021 8:00 am IST


గత నెల ఆఖరు నుంచి వచ్చే ఇంకో ఐదు రోజులు వరకు టాలీవుడ్ సహా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ హవానే నడుస్తుంది. తాను నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి వరుస అప్డేట్స్ తో మేకర్స్ ఒక రేంజ్ హోరెత్తిస్తుండగా పాత రికార్డుల సంగతి మహేష్ అభిమానులు చూసుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

అయితే ఖచ్చితంగా టీజర్ అనే అందరికీ సమాచారం ఉంది. కానీ దీనిని కూడా మహేష్ గత సినిమాల్లానే ప్రత్యేకంగా ప్రెజెంట్ చేయనున్నారట. అంతే కాకుండా థమన్ ఎలెక్ట్రీఫయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోలో ఇంప్రెస్ చేస్తుందని తెలుస్తుంది. అలాగే దర్శకుడు పరశురామ్ పెట్ల మహేష్ పలికించిన ఎనర్జిటిక్ పంచ్ డైలాగ్ ని కూడా ఈ వీడియోలో పొందుపరిచినట్టు స్ట్రాంగ్ బజ్.

మొత్తానికి మాత్రం అదిరే విజువల్స్ మహేష్ అభిమానులకి సహా మాస్ అభిమానులకి మాంచి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఈ వీడియో ఉండనుంది తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :