ప్రభాస్ పెళ్లి పై హాట్ గాస్సిప్, అమెరికా అమ్మాయితోనా?

Published on Aug 3, 2019 7:25 am IST


ప్రభాస్ పెళ్లి అనేది ఇండస్ట్రీ లో ఎప్పుడూ హాట్ టాపిక్ నే. గత కొన్నేళ్లుగా ఆయన పెళ్లి విషయంపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి చిత్రానికి ముందే ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో బాహుబలి హెవీ షెడ్యూల్స్ దృష్ట్యా ప్రభాస్ ఆ చిత్రం తరువాతే పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. కానీ ఇప్పటికి బాహుబలి విడుదలై రెండేళ్లు దాటిపోతుంది. బాహుబలి చిత్రం తరువాత వెంటనే సాహో చిత్రం తో ఆయన మళ్ళీ బిజీ అయ్యారు.

ఈ విషయం పై స్వయంగా ప్రభాస్ ని అడిగితే, ఆయన అంతా పెద నాన్న ఇష్టమే అంటూ తెలివిగా తప్పించుకుంటున్నారు. మరి కృష్ణమ్ రాజు కూడా ప్రభాస్ పెళ్లి పై స్పష్టత ఇచ్చింది లేదు. ఇంకొద్ది రోజులలో ప్రభాస్ 40వ వసంతం లోకి అడుగిడనున్నారు. దీనితో ఆయన ఫ్యాన్స్ లో ఈ విషయం పై ఇంకా ఆసక్తి పెరిగిపోయింది.

గతంలో ప్రభాస్, అనుష్క ను పెళ్లి చేసుకోనున్నారని, ఈ విషయంలో ఇరు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడుకోవడం జరిగిందని ప్రముఖంగా వినిపించి. ఈ విషయాన్ని ఇరువురు, మేము స్నేహితులం మాత్రమే అని ఖండించారు.

తాజాగా ప్రభాస్ అమెరికా అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ పెళ్లి జరగనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఉన్న నిజమేమిటో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సిందే. ఈ నెల 30 న సాహో విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ చిత్ర ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు.

సంబంధిత సమాచారం :