తేజ.. ‘అలిమేలుమంగ’ పై మరో రూమర్ !

Published on Jul 11, 2020 7:28 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో కూడా హీరోయిన్ సమస్యే. పైగా అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోందట. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అలిమేలు మంగగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారు. వారిలో ముఖ్యంగా కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది.

అనుష్క కూడా వచ్చిన సినిమాలన్నీ అంగీకరించట్లేదు. దాంతో చేసేది ఏం లేక తేజ మిగిలిన హీరోయిన్స్ లిస్ట్ ను చూడగా.. హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మొదట అనుకున్నా ఇప్పటికే కీర్తి వరుస సినిమాలు ఒప్పుకుని మరో ఏడాది వరకూ బిజీగా వుంది. ఈ మధ్యలో రకుల్ ను కూడా కదిలించారు గానీ, కుదరలేదు. దాంతో తేజ.. సాయి పల్లవికి ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అన్ని కుదిరితే నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More