లీకైన స్టార్ హీరో మూవీ స్టోరీ…,పాయింట్ ఓరేంజ్ లో…!

Published on Nov 18, 2019 11:21 am IST

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ టైమ్ మాములుగా లేదు. ఆయన వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. దీపావళి కానుకగా విడుదలైన బిగిల్ మూవీ కూడా 250కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో దుమ్మురేపింది. తెలుగులో విజిల్ గా విడుదలైన ఈచిత్రం విజయ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. విజయ్ తన తదుపరి చిత్రం ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈమూవీ కథ లీకైనట్టు తెలుస్తుంది. విజయ్ ఈ చిత్రంలో మాఫియా నేపధ్యం కలిగిన కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపిస్తారట. మాళవిక మోహన్, చేతన్, అలగమ్ పెరుమాళ్, శాంతను, ఆండ్రియా,రమ్య సుబ్రహ్మణ్యన్, సౌందర్య నందకుమార్ మరియు గౌరీ కిషన్ తో పాటు చాలా మంది స్టూడెంట్స్ లా కనిపిస్తారట. దీనిలో ఎంత నిజంతో ఉందో తెలియదు కానీ, కోలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. గ్జివియర్ బిట్టొ ఫిలిం క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

X
More