ఇంట్రెస్టింగ్..పవన్ మాస్ చిత్రానికి టైటిల్ ఇదేనా.?

Published on Aug 3, 2021 11:11 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఇప్పుడు శరవేగంగా తెరకెక్కిస్తున్న పవన్ – రానా చిత్రం కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నిన్ననే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సహా ఫస్ట్ సింగిల్ పై కూడా అప్డేట్ ని ఇచ్చేసింది.. అయితే ఇక ఇక్కడ నుంచి భారీ అంచనాలు నెలకొల్పుకొని రెడీ అవుతున్న ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఇప్పటికే చాలా ఆసక్తికర అప్డేట్స్ ఈ సినిమా నుంచి వచ్చేసాయి కానీ ఇంకా ఈ చిత్రం టైటిల్ ఏంటి అన్నది గోప్యంగానే ఉంది. కానీ తాజా బజ్ అయితే ఈ చిత్రానికి టైటిల్ గా భీమ్లా నాయక్ టైటిల్ ని అనుకుంటున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవన్ రోల్ గా దీనిని అనౌన్స్ చేయడంతోనే భారీ రెస్పాన్స్ వచ్చింది.

అందుకే దీనినే మేకర్స్ ఫిక్స్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ముందు “పరశురామ కృష్ణమూర్తి” అనే టైటిల్ కూడా లైన్ లోకి వచ్చింది అని విన్నాము. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో లేక కొత్తగా ఏదన్నా వస్తుందేమో అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :