మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ ఎలిమెంట్స్ కి కామెడీని పర్ఫెక్ట్ గా జతచేసి చెప్పగలిగే డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ మొదటి సారి ఇంతకూ ముందెన్నడూ చేయని ఓ స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్నాడు. అందుకోసమే రామ్ చరణ్ థాయ్ ల్యాండ్ కూడా వెళ్లి ఓ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో రామ్ చరణ్ సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్ ని పరిశీలిస్తున్నారని అంటున్నారు. చరణ్ సినిమాకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం.
ఈ పేరు హాలీవుడ్ లో పేరున్న ఓ స్టార్ హీరో మరియు మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ డి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సినిమాలో తను చేస్తున్న పాత్ర కోసం ఇండస్ట్రీలోని ఫైట్స్ మాస్టర్స్ అయిన స్టన్ శివ, థిల్లర్ మంచు హార్స్ మెన్ బాబు, రాంబో రాజ్ కుమార్ మొదలైన వారి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. ఈ చిత్ర టీం మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడి అందమైన లోకేషన్స్ లో రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేయనున్నారు. రామ్ చరణ్ తో మొదటి సారి జోడీ కడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననుంది.
రామ్ చరణ్ కి సిస్టర్ పాత్రలో కృతి కర్బంద నటించనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ కలగలిపిన ఈ సినిమాకి డివివి దానయ్యనిర్మాత, అలాగే అక్టోబర్ 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.


