ఇంట్రస్టింగ్ ట్రైలర్ తో వచ్చిన ‘తూటా’ !

Published on Nov 20, 2019 10:28 pm IST

విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో హీరో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘తూటా’. కాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను చూస్తుంటే.. గౌతమ్ మీనన్ మళ్లీ ప్రేమికుల మధ్య సరళమైన మరియు ఆసక్తికరమైన కథను రాసుకునట్లు అనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ధనుష్ రెండు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు.

ఇక తెలుగులో ఈ చిత్రాన్ని విజయభేరి నిర్మాణ సంస్థ పై తాతారెడ్డి, సత్యనారాయణ రెడ్డి విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి దుర్బుక శివ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభించినట్లుగానే చిత్రానికి కూడా లభిస్తోందేమో చూడలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More