వైరల్ గా మారిన బాలయ్య నెక్స్ట్ సినిమా ట్రెండీ టైటిల్.!

Published on Jun 9, 2022 12:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక మాసివ్ అనౌన్సమెంట్ కూడా రాగా బాలయ్య బర్త్ డే కి మాత్రం మామూలుగా ఉండదు అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మరో దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేయనున్నారు. ఇప్పుడు దీనిపైనే క్రేజీ బజ్ ఒక ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాకి గాను “బ్రో ఐ డోంట్ కేర్” అనే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండీ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా గట్టి టాక్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

అయితే ఈ డోంట్ కేర్ అనే మాటపై బాలయ్య భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ చెన్న కేశవరెడ్డి లో సాంగ్ గగుర్తు రాక మానదు. మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు ఈ టైటిల్ మంచి ఆసక్తిగా మారింది. మరి దీనిపై క్లారిటీ కోసం అయితే అంతా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :