రానా క్యారెక్టర్ లో ఆసక్తికరమైన ట్విస్ట్..!

15th, April 2017 - 09:52:56 AM


ఆరడుగుల ఆజానుబాహుడు రానా ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీ గా ఉన్నాడు.ఈ చిత్రం ఏప్రిల్ 28 న విడుదలవుతోంది. కాగా రానా తదుపరి చిత్రం తేజ దర్శకత్వంలో రానున్న విషయం తెలిసిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా ఈ చిత్రంలో మొదట ఫైనాన్షియర్ గా కనిపిస్తాడట. కథలో చోటుచేసుకున్న మలుపులతో అతడు రాజకీయ నాయకుడిగా మారతాడు. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రంలో రానా సరసన కాజల్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.