షూటింగ్ కొరకు రెండు రోజులు బ్రిడ్జ్ మూసేశారట.

Published on Aug 30, 2019 7:15 pm IST

యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎటెర్టైనర్ వార్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన వార్ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అద్బుతంగా ఉంది. గురు శిష్యులైన హృతిక్, టైగర్ ల మధ్య నడిచే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు అనిపిస్తుంది.వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

ఐతే ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సన్నివేశ చిత్రీకరణ గురించి దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ఓ ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నాడు. పోర్చుగల్ దేశంలో గల ఒక ఎత్తైన బ్రిడ్జ్ పైన హృతిక్, టైగర్ ల మధ్య ఒక ఉత్కంఠమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఆ సన్నివేశ చిత్రీకరణ కొరకు పోర్టో అనే ఆ బ్రిడ్జ్ ని రెండు రోజుల పాటు ప్రజల రాకపోకలకు జరగకుండా మూసివేయడం జరిగిందట. దానితో పాటు అక్కడి స్థానిక ప్రజలు వారిద్దరిపై తెరకెక్కిన ఆ యాక్షన్ సన్నివేశం చూసి నివ్వెరపోయారట.

సంబంధిత సమాచారం :

More