‘చరణ్ – ఎన్టీఆరే’ కాదు, మహేశ్ కూడా దేశ భక్తుడే !

Published on Mar 19, 2019 4:10 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న అతి కొద్దిమంది డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు అనిల్. కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. మహేశ్ ఈ సినిమాలో ఓ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. సెలవుల కోసం తన ఊరుకొచ్చిన హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఈ కథ మొదలవుతుందని.. సినిమాలో తన శైలి కామెడీనే హైలెట్ అయ్యే విధంగా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారని సమాచారం.

అలాగే సినిమాలో దేశభక్తికి సంబధించి ఓ సీక్వెన్స్ కూడా ఉండనుంది. ఈ సీక్వెన్స్ లో మహేశ్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ దేశ భక్తులుగా నటిస్తున్నారు. ఇప్పుడు మహేశ్ కూడా అనిల్ రావిపూడి సినిమాలో ఓ ఎపిసోడ్ లో దేశభక్తుడిగా నటిస్తుండటం విశేషం. సినిమాకే ఈ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More