విలన్ గా రానున్న మల్టీ టాలెంటెడ్ హీరో !

Published on May 24, 2019 10:56 am IST

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం దర్శకుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్ ‌సేన్‌. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ఇటివలే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కానీ ఈ సారి దర్శకుడిగా కాదు, హీరోగా కార్టూన్ అనే చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా ప్ర‌దీప్ పులివ‌ర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రానున్న ఈ ‘కార్టూన్‌’ చిత్రంలో విశ్వక్‌ సేన్ విలన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో విలనే మెయిన్ అట.
డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేతుల మీదుగా ఇటివలే ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జరిగింది. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కబోతున్న ఈ సినిమా జూన్ 3 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :

More