‘ఎఫ్ 3’లో మరో మెగా హీరో ?

Published on Jan 19, 2021 1:10 am IST


టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ… ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘ఎఫ్ 3’. వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి చేస్తోన్న ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది అధికారికంగా ప్రకటించే వరకూ నమ్మలేము.

కాగా ఇప్పటికే ‘ఎఫ్ 3’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా షూట్ కి రెడీ అయ్యాడు. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత చేయడానికి వరుణ్, వెంకీల నుండి రాబోతున్న సినిమా ‘ఎఫ్ 3’నే.

సంబంధిత సమాచారం :