ఇప్పటికైనా స్టార్ హీరోలతో ఛాన్స్ లు వస్తాయా ?

Published on Apr 2, 2020 1:00 am IST

‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా . ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి చిత్రాల్లో ఇషా తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయినప్పటికీ ఇషా రెబ్బా కెరీర్ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి పడుతుందట. కెరీర్ పరంగా తాను ఆశించిన్నట్లు తాను లేదనే ఫీలింగ్ లో ఉందట ఇషా.

ఆ మధ్య వచ్చిన ‘రాగల 24 గంటల్లో’తో ఏవరేజ్ హిట్ అందుకున్న ఆ స్థాయిలో తనకు గుర్తింపు రావడంలేదని తెగ ఇదయపోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదటి నుంచీ ఆమెకు అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు అయితే దక్కలేదు. దాంతో తానూ గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చేయటానికి రెడీ అని గతంలో చెప్పింది.

పైగా గత కొన్ని రోజులుగా ఈషా రెబ్బ హాట్ ఫ్యూటీ షూట్స్ తో సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది. మరి ఇప్పటికైనా ఇషాకి స్టార్స్ పక్కన నటించే అవకాశం వస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More