మహేష్ – వంశీ పైడిపల్లి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Jan 25, 2020 7:42 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని మహేష్ రోల్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఈ సినిమాలో జేమ్స్ బాండ్ రోల్ తరహాలో పూర్తి యాక్షన్ పాత్రలో నటించబోతున్నారట. అలాగే ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి రూపొందించినట్లు తెలుస్తోంది.

కాగా మే నెల‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇక వంశీ, మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పైగా ‘మహర్షి’ ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా అని ప్రముఖుల చేత ప్రశంసలు కూడా పొందింది. మరి ఈ సారి చేయబోతున్న సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :