మెమరీ లాస్ రోల్ లో టాలెంటెడ్ హీరో !

Published on Mar 28, 2020 1:00 am IST

యంగ్ హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీ ’18 పేజెస్’ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్నారు నిఖిల్. ఆ తరహాలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫార్ములా మీద తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చినా ఈ కథ కొత్తగా ఉంటుందట. అంతేకాదు ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న’కార్తికేయ 2′ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.

సంబంధిత సమాచారం :

X
More