ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Sep 19, 2021 11:37 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ చిత్రాల్లో ఇప్పుడు రెండు ఆల్రెడీ షూట్ ప్రోగ్రెస్ లో ఉండడమే కాకుండా రిలీజ్ కి కూడా రెడీ అవుతున్నాయి. కానీ వీటి తర్వాత వీటి అన్నిటికి మించి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ సినిమా “ప్రాజెక్ట్ కే” కూడా లైన్ లో ఉంది. భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలు స్టార్ట్ చెయ్యగా మరో సాలిడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేకర్స్ సైడ్ నుంచి బయటకి వచ్చింది.

మరి దీని ప్రకారం ఈ సినిమా నుంచి కొత్త షెడ్యూల్ ని మేకర్స్ నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూట్ నుంచి సినిమా మెయిన్ క్యాస్ట్ అంతా కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే బహుశా ప్రభాస్ కూడా ఈ చిత్రంలో పాల్గొనొచ్చు. ఇంకా అలాగే ఈ చిత్రం షూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఏడాది దాటుతుంది అని నిర్మాత అశ్వని దత్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొనె తదితరులు నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :