ప్రభాస్ నెక్స్ట్ మూవీ స్టోరీ లైన్ వింటే మతిపోవాల్సిందే

Published on Aug 29, 2019 7:00 am IST

ప్రభాస్ యాక్షన్ బొనాంజా సాహో రేపే గ్రాండ్ గా విడుదల కానుంది. కొన్ని ప్రదేశాలలో ఈ రోజు సాయంత్రమే సాహో ప్రీమియర్ షో లు ప్రదర్శించనున్నారు. ప్రభాస్ మాత్రం ప్రచార కార్యక్రమాలలో విపరీతంగా పాల్గొంటున్నారు.

ఐతే అప్పుడే ఆయన తదుపరి చిత్రం పై అనేక ప్రశ్నలు సంధిస్తూ ఆసక్తికరమైన సమాధానాలు రాబడుతున్నారు, మీడియా ప్రతినిధులు. ఒక టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రభాస్ తన తదుపరి చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు.

మీ నెక్స్ట్ మూవీ లవ్ స్టోరీ అంట కదా… ఎలావుండబోతుంది? అని అడుగగా ప్రభాస్ అవును 1960 ల నాటి యూరప్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన ప్రేమ కథ, ఇంత వరకు ఇలాంటి లవ్ స్టోరీ భారత చిత్రాలలో చూసివుండరు, కొత్తగా ఉంటుందని ఆసక్తికర విషయం బయటపెట్టారు. దీనితో ప్రభాస్ నెక్స్ట్ మూవీ పీరియాడిక్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది.

అలాగే భారీ బడ్జెట్ మూవీ కాకపోయినప్పటికీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది అని ప్రభాస్ చెప్పారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 20రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :