సాహో దర్శకుడి నెక్స్ట్ హీరో అతడేనట…?

Published on Nov 18, 2019 12:00 am IST

సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటరైనర్ ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ఆ మూవీ చవిచూసిన ఫలితం కారణంగా కొన్నిరోజులు వార్తలలో కనిపించలేదు. నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ ఇండియా 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచినప్పట్టికి సాహో చిత్ర థియరిటికల్ హక్కులను భారీ ధరలకు విక్రయించడంతో సాహోను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా చోట్ల నష్టాలు చవిచూశారు. దీనితో సాహో మూవీ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దర్శకుడు సుజీత్ ని కూడా చాలా మంది విమర్శించారు.

ఐతే అనూహ్యంగా ఉత్తర భారత దేశంలో సాహో మూవీ హిట్ గా నిలిచింది. సాహో హిందీ వర్షన్ 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాలు పంచింది. సాహో విడుదలైన రెండున్నర నెలల తరువాత సుజీత్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్త ఒకరి ప్రచారంలోకి వచ్చింది. తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన శర్వానంద్ తో సుజీత్ మూవీ చేయనున్నారని సమాచారం. సుజీత్ మొదటి చిత్రం రన్ రాజా రన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని అప్పుడు యూవీ క్రియేషన్స్ నిర్మించారు. దీనిపై ఇంకా స్పష్టత లేకున్నప్పటికీ సుజీత్ శర్వానంద్ కలిసి చేస్తారని జోరుగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More