సైరా ట్రైలర్ పై ఇంట్రస్టింగ్ అప్డేట్

Published on Jul 28, 2019 2:00 am IST

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా “. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు,విజయసేతుపతి,అమితాబ్,తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ గురుంచి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే. కాగా సైరా మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :