‘లైగర్’తో విజయ్ దేవరకొండకి ఆ ఇమేజే వస్తోందట !

Published on Aug 2, 2021 6:05 pm IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం బాక్సింగ్ కోచ్ సారధ్యంలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ సీన్స్ కోసం కఠినంగా కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీన్స్ చూశాక విజయ్ దేవరకొండకి యాక్షన్ హీరోగా ఫుల్ ఫాలోయింగ్ వస్తోందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. యష్ కి కెజిఎఫ్ తో ఎలాంటి ఇమేజ్ వచ్చిందో విజయ్ కి కూడా ఈ సినిమాతో అలాంటి ఇమేజే వస్తోందట.

అందుకే వర్మ కూడా రీసెంట్ గా ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ ‘టైగర్ – మరియు లయన్ ల క్రాస్ ఓవర్ కంటే కూడా విజయ్ దేవరకొండ పాత్ర సూపర్ క్రాస్ గా ఉంటుందని’ కామెంట్ చేశాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :