నితిన్ పెళ్లి పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 24, 2020 5:15 pm IST

హీరో నితిన్ ఏప్రిల్ 16న దుబాయ్‌ లో తన డెస్టినేషన్ వెడ్డింగ్‌ ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు మేము మొదట వెల్లడించినట్లుగానే అక్కడ పెళ్లి ఇప్పుడు రద్దు చేయబడింది. దుబాయ్ కూడా కరోనా ప్రభావిత దేశాలలో ఉండడంతో పాటు, వారు ఇతర దేశాల నుండి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనితో నితిన్ మ్యారేజ్ అక్కడ రద్దు అయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం వివాహం అదే తేదీన హైదరాబాద్‌ లో జరుగుతుంది. వధువు ఇంటి వద్దే వివాహానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది దగ్గర బంధువుల మాత్రమే ఈ వివాహానికీ హాజరుకానున్నారు. ఇక నితిన్ కరోనాను అరికట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల రూపాయలను మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More