‘బిగ్ బాస్3’లో కొట్టుకోవడానికి గుడ్లు కొన్న నాగార్జున

Published on Jun 29, 2019 9:42 am IST

ఎట్టకేలకు ఉహాగానాలకు,అనుమానాలకు తెరదించుతూ ‘బిగ్ బాస్3’ కి హోస్ట్ కింగ్ నాగార్జునే అని తేలిపోయింది. స్టార్ మా నిన్న నాగార్జున నటించిన ‘బిగ్ బాస్ 3’ కొత్త ప్రోమోని విడుదల చేసింది. వేలికి కోతి బొమ్మ,చేతిపై బిగ్ బాస్ లోగో టాటూ ఉన్న నాగార్జున బిగ్ బాస్ 3 లో పాల్గొంటున్న సభ్యుల కోసం స్వయంగా మార్కెట్ కి వెళ్లి షాపింగ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో కొట్టొకొవడానికి గుడ్లు,వగలుపోయేవారికోసం వంకాయలు, 14 మంది వంద రోజులు తినడానికి సరిపడా బియ్యం కొనేశారు. ప్రోమో చివర్లో బిగ్ బాస్3 కోసం ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నా అని నాగార్జునే స్వయంగా చెప్పేశారు.

ఈసారి బిగ్ బాస్ ఇంకా కొంచెం స్పైసీ గా,సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున చెప్పకనే చెప్పారు. ఐతే కమింగ్ సూన్ అంటూ ఎప్పుడు మొదలుకానుంది అనే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కమల్ హాసన్ హోస్ట్ గా తమిళ్ బిగ్ బాస్3 ఆల్రెడీ మొదలైన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More