ఇంటర్నేషనల్ ఛాంపియన్ వద్ద విజయ్ ట్రైనింగ్

Published on May 22, 2019 2:00 am IST

వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ చేస్తున్న తర్వాతి చిత్రం ‘హీరో. తెలుగు, తమిళంలలో రూపొందనున్న ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేయనున్నారు. బైక్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో విజయ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో హెవీ యాక్షన్, రేసింగ్ సన్నివేశాలు ఉండనున్నాయి. వీటి కోసం విజయ్ అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కొన్నిరోజులు శిక్షణ తీసుకోనున్నాడు. ఇకపోతే ఇందులో ‘పేట’ ఫేమ్ మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More