పండుగాడిగా రామ్ ?

Published on Dec 30, 2018 9:37 am IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా చేయనున్నాడని తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో రామ్ పాత్రకు పండుగాడు అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడట పూరి. ఇంతకుముందు పూరి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ పోకిరి లో మహేష్ పాత్రకు కూడా అదే పేరు పెట్టి ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఈ కొత్త చిత్రంలో కూడా రామ్ పాత్ర కూడా అంతే రఫ్ గా డిఫరెంట్ లుక్ లో వుండనుందట. అందుకే ఆ పాత్రకు పండుగాడు అనే టైటిల్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాడు అని సమాచారం.

పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది మే లో విడుదలకానుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి ఇప్పటినుండే మంచిహైప్ వస్తుంది.

సంబంధిత సమాచారం :