ఇంటర్వ్యూ : మెగా డాటర్ నిహారిక – నేను సైరాలో నటిస్తానని చరణ్ అన్న కాళ్లు పట్టుకొని మరి అడిగాను.

ఇంటర్వ్యూ : మెగా డాటర్ నిహారిక – నేను సైరాలో నటిస్తానని చరణ్ అన్న కాళ్లు పట్టుకొని మరి అడిగాను.

Published on Jul 26, 2018 5:52 PM IST

సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. కాగా ఈ సందర్భంగా, మెగా డాటర్ నిహారిక మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

సినిమా రిలీజ్ కు ముందే సినిమా ప్రమోషన్స్ కోసం టూర్స్ కు వెళ్లారు కదా, ఎలా అనిపించింది ?
టూర్స్ జనరల్ గా సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాక థాంక్స్ చెప్పడానికి వెళ్తారు. కానీ మేము ఇక్కడ సినిమా బాగుంటుందని ప్రమోట్ చెయ్యడానికి వెళ్లాం. నేను ఇలా వెళ్లడం ఫస్ట్ టైం. మొదట చాలా భయపడ్డాను.

మరి భయపడితే టూర్స్ లో ఆడియన్స్ తో ఎలా ఇంట్రాక్ట్ అయ్యారు ?
అంటే మేము ఎక్కువుగా ఉమెన్స్ కాలేజీస్ కే వెళ్ళాము. మా హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఎక్కువుగా అమ్మాయిలకే కనెక్ట్ అవుతుంది కాబట్టి, వారికి మా సినిమా గురించి చెప్పడం చాలా ఈజీ అయింది.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
సినిమాలో నా పాత్ర పేరు అక్షర. ఫ్యాషన్ డిజైనర్, సింపుల్ గా చెప్పాలంటే (నవ్వుతూ) తను చాలా సింపుల్ అమ్మాయి. అసలు మా సినిమాలో విలన్ లేరు. ఎవరన్నా ఉన్నారంటే అది నేనే. అంటే నా క్యారెక్టరే. నా క్యారెక్టర్ తీసుకున్నే డెసిషన్స్ వల్లే సినిమాలో మలుపులు వస్తాయి.

మీరు సుమంత్ అశ్విన్ పక్కన చేయడానికి కారణం ఏమిటి ?
నిజం చెప్పాలంటే, ఇప్పటి వరకు నేను ఒకే చేసిన సినిమాలు గాని, ఒకే చెయ్యబోయే సినిమాల్లో గాని హీరో ఎవరు అని, యాక్టర్స్ ఎవరు అని చూడను. నేను చేయబోయే క్యారెక్టర్ నాకు నచ్చింది లేదా అని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను.

మీరు స్టార్ హీరోలతో చెయ్యరా ?
చెయ్యను అని ఏమీ లేడండి, చేస్తాను. కాకపోతే రంగస్థలంలో సమంత పాత్రలాంటి పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే సినిమాలో నా పాత్ర ఉండడానికి మంచి రీజన్ ఉండాలి.

అయితే మీరు కర్తవ్యం లాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది కదా ?
ఈ కర్తవ్యం అన్న మాటనే సేమ్ పరుచూరి గోపాలకృష్ణ అంకుల్ కూడా అన్నారు. మీరు రాయండి అంకుల్, నేను తప్పకుండా చేస్తానని అన్నాను. వెయిట్ చేస్తున్నాను (నవ్వుతూ) ఆయన రాసుకొని వస్తారని.

మీరు వరుసగా డెబ్యూ డైరెక్టర్స్ తోనే పని చేస్తున్నారు. ఏమైనా కారణం ఉందా ?
అవును. నేనిప్పుడూ నాలుగో సినిమా చేస్తున్నాను. అందరూ డెబ్యూ డైరెక్టర్స్ తోనే పని చేశాను. ఇది నేనేం కావాలని ప్లాన్ చెయ్యలేదు. అలా వచ్చాయి అంతే. అయిన డెబ్యూ డైరెక్టర్స్ చాలా కొత్త పాయింట్స్ తో వస్తున్నారు. పైగా వాళ్ళు నా కోసం సినిమా చెయ్యరు, వాళ్ళ కోసం, వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలనే కసితో సినిమా చేస్తారు.

సుమంత్ అశ్విన్ గురుంచి చెప్పండి ?
నేను సుమంత్ సినిమాలు చూసిన దాన్నిబట్టి అతను చాలా చలాకీగా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు అనుకున్నాను. కానీ తను దానికి అపోజిట్. సెట్లో కూడా నేను సుమంత్ తో మాట్లాడింది కూడా తక్కువే. తనెప్పుడు తన లోకంలోనే ఉంటాడు.

మీకు సైరాలో అవకాశం వస్తే నటిస్తారా ?
నేను ఆల్ రెడీ సైరాలో నటిస్తోన్నాను అండి. మా చరణ్ అన్న కాళ్లు పట్టుకొని మరి అడుక్కున్నా. డాడి పక్కన కనీసం ఓ చిన్న రోల్ అన్న చెయ్యాలని. కానీ చరణ్ అన్న నేను ప్రొడ్యూసర్ని కదా, నేను ఒకే చెయ్యకూడదు అంటుండగా, కరెక్ట్ గా సురేందర్ రెడ్డిగారు ఎంటర్ అయ్యారు. ఆయన్ని అడిగి మరి యాక్ట్ చేస్తున్నాను. సినిమాలో ఓ గిరిజన యువతిగా కనిపిస్తాను. నాకు రెండు మూడు డైలాగ్ లు కూడా ఉంటాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు